సహకార వారోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

కేంద్ర, రాష్ట్ర సహకార మంత్రిత్వ శాఖల ఆదేశాల మేరకు జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సహకార వారోత్సవాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పీజీఆర్‌ఎస్ మందిరంలో ఆవిష్కరించారు. "సహకారంతో సమృద్ధి–సమగ్ర అభివృద్ధికి పునాది", "మన గ్రామం–మన సహకారం–మన అభివృద్ధి" నినాదాలతో వారం రోజుల పాటు అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాలు, ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన, వ్యాసరచన పోటీలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ముగింపు రోజున సెమినార్, బహుమతుల ప్రదానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్