ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధతపై జిల్లా పోలీస్ శాఖ అవగాహన

ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “స్ఫూర్తి – విజయానికి సోపానం” అనే కార్యక్రమం గురువారం నిర్వహించారు. మన్యం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రణాళికతో చదవడం, సహనం, సాధన, క్రమశిక్షణ విజయానికి మార్గాలని, పరీక్షల్లో ప్రదర్శన కూడా కీలకమని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వర రావు, ఏఎస్పీ మనీషా రెడ్డి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్