కురుపాం గ్రామదేవత ప్రతిష్టకు రూ.6,116 విరాళం

కురుపాం గ్రామంలో గ్రామదేవత ప్రతిష్టా కార్యక్రమానికి నడుకూరు కుటుంబం (మోహనరావు మనవళ్లు) రూ.3,000, నడుకూరు సతీష్ రూ.3,116 చొప్పున మొత్తం రూ.6,116 నగదు విరాళంగా అందించారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో ప్రారంభమైన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మే 1 వరకు కొనసాగుతుంది. మే 4, 5, 6 తేదీలలో అమ్మవారి పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే సోమ, మంగళ, బుధవారాల్లో ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయని, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు, నిర్వాహకులు కోరారు.

సంబంధిత పోస్ట్