ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. రెండవ అదనపు జిల్లా జడ్జి ఎం. మాధురి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్నారుల చేతుల్లో పుస్తకాలు ఉండాలని, పనిముట్లు కాదని అన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. బాల కార్మికులను గుర్తించి వారికి విద్య అందేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో న్యాయ, కార్మిక, బాలల సంరక్షణ శాఖ అధికారులు పాల్గొన్నారు.