పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్వతీపురం జిల్లాలో పరీక్షలు రాసిన 10,646 మంది విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. నెలల తరబడి సాగుతున్న నిరీక్షణకు రేపటితో ముగింపు పడనుంది, దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది.