అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వ కట్టుబాటు.. మంత్రి సంధ్యారాణి

పార్వతీపురంలో సోమవారం జరిగిన బేటీ బచావో–బేటీ పఢావో కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహనకు అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచామని, మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చామని, 217 మందికి పదోన్నతులు అందజేశామని తెలిపారు. మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అంగన్వాడీల పనితీరును ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్