పార్వతీపురం మున్సిపాలిటీలోని కొత్తవలస ప్రాంత ప్రజలకు పట్టణ ఉప ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. కొత్తవలస తన సన్నిహిత ప్రాంతమని, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, మజ్జి పారినాయుడు, కోలా మధుసూదన్ రావుల కృషితో ఈ కేంద్రం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. తాత్కాలికంగా సొంత ఇంట్లోనే సేవలు అందిస్తామని, ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.