ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు

అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మండలం బెలగాం బంగారమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. గొట్టాపు వెంకట రమణ గురుస్వామి, ఆర్నిపల్లి వెంకట రమణ గురుస్వామి, ఏండ్రాపు శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల అయ్యప్ప మాల ధరించిన స్వాములు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్