అవ్వాతాతల ఆనందం- ఎన్టిఆర్ భరోసా పెన్షన్ తో సాకారం

మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి శనివారం పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా వేలాది మంది పేద, బలహీన వర్గాల ప్రజలు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ఈ పథకం వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు వంటి వర్గాలకు ఆర్థిక భరోసా అందిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. అవ్వాతాతల ఆనందం ఈ పెన్షన్ తో సాకారమవుతోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్