పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమా ఈనెల 5న విడుదల కానున్న నేపథ్యంలో, పార్వతీపురం పట్టణంలో అభిమానులు సందడి చేశారు. టీబిఆర్ సినిమాస్ వద్ద నందమూరి అభిమాని సేవా సంఘం నాయకులు సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభిమానులు పటాకులు కాల్చి, కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. సినిమా విడుదల రోజున భారీ హంగులతో ఫ్యాన్స్ షో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.