గున్న ఏనుగు సంచారం… హైఅలర్ట్ జారీ

ఒడిశా సరిహద్దు దాటి మరో గున్న ఏనుగు మన్యం జిల్లాలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం భామిని మండలం కాట్రగడ వైపు దీని కదలికలను గుర్తించినట్లు ఏనుగుల పర్యవేక్షణ రేంజర్ కె. మణికంఠేశ్ తెలిపారు. బొమ్మిక, నేరడి, పక్కుడిభద్ర, వడ్డంగి పరిసర గ్రామాల్లో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెవెన్యూ, విద్యుత్తు, పోలీసు శాఖలకు సమాచారం అందించారు. గున్న ఏనుగు రాకతో ఈ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య ఐదుకి చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీశాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్