మన్యం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం, వాతావరణ శాఖ అంచనాల మేరకు జిల్లాలోని 15 మండలాలలో ఉష్ణోగ్రతలు 41° నుండి 54° డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.