జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై. నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాక్టికల్స్ ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజు చెల్లించిన విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను ఖరారు చేశారు. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురంలో, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు పార్వతీపురం, సాలూరు, వీరఘట్టం, పాలకొండ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు ఈ వివరాలు తెలియజేసి పరీక్షలకు హాజరయ్యేలా చూడాలని సూచించారు.