జలధార పనులతో గిరిజన గ్రామాల్లో సాగునీటి వెలుగు

పార్వతీపురం మన్యం జిల్లాలోని కారడవలస, నారింజపాడు గ్రామాల్లో జలధార–జలహారతి పనుల ద్వారా సాగు, తాగునీటి పరిస్థితులు మెరుగుపడ్డాయి. చెరువుకు గట్టు, మదుము ఏర్పాటుతో నీటి నిల్వ పెరిగి రైతులు రెండు పంటలు సాగు చేసే అవకాశం ఏర్పడింది. చతురస్రాకార రీఛార్జ్ బావి ద్వారా భూగర్భ జలాలు పెరిగి అదనంగా 20 ఎకరాలకు నీరు అందుతోంది. కొండ ఊటను వినియోగించి తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో గ్రామాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందుతోంది.

సంబంధిత పోస్ట్