గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై మూతబడిన మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటలో గల ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని సంబంధిత అధికారులు, యాజమాన్యానికి ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సూచించారు. చాలా కాలంగా మూతబడి ఉన్న సీతానగరం షుగర్ ఫ్యాక్టరీని జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ సభ్యులు (ఆర్పీలు) గురువారం పరిశీలించారు. పలు అంశాలపై ఆర్పీలు సమీక్ష నిర్వహించారు