మహా లొద్ద జలపాతం ప్రారంభం: మరో ఆంధ్రా ఊటీగా మన్యం

సహజసిద్ధమైన సౌందర్యాలకు మన్యం కేరాఫ్ అడ్రస్ అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. జిల్లాను మరో ఆంధ్రా ఊటీలా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సాలూరు మండలం కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని మహా లొద్ద జలపాతాన్ని ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ జలపాతానికి చేరుకునేందుకు రూ. 6 కోట్లతో 6 కిలోమీటర్ల రహదారి నిర్మించనున్నట్లు వెల్లడించారు. పర్యాటక అభివృద్ధితో గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్