ఆయకట్టు సంఘ అభివృద్ధికి సంఘ సభ్యులు ఉన్నతాధికారులతో బుధవారం మక్కువలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో జూలై నెల ఆఖరు నాటికి, మూడు మండలాల రైతులకు, సాగునీరు అందించాలని అన్నారు, ఎటువంటి అవంతరాలు జరగకుండా, ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో మక్కువ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్, నీటి సంఘ చైర్మన్, ఉప చైర్మన్, నీటి సంఘ సభ్యులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.