బలిజిపేట మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్, టీచర్స్ మీటింగ్స్ విజయవంతంగా నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి 1 సామల సింహాచలం తెలిపారు. అన్ని పాఠశాలల్లో తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారని వివరించారు. పలు పాఠశాలల్లో పోటీలు నిర్వహించినట్లు వివరించారు. అంతేకాకుండా మొక్కలు కూడా నాటినట్లు తెలిపారు.