పార్వతీపురంలో వేంకటేశ్వర స్వామి దర్శించిన మంత్రి సంధ్యారాణి

సోమవారం పార్వతీపురంలో పర్యటించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్