పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం మంత్రి డోల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర కలెక్టర్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ, గురుకుల పాఠశాల, సచివాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల నిర్వహణ, విద్యాబోధన, విద్యార్థులకు భోజనం, వసతి వంటి అంశాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు.