పార్వతీపురం మున్సిపాలిటీలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శుక్రవారం 22వ వార్డులో పర్యటించి ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, శానిటేషన్, తాగునీరు, రోడ్ల సమస్యలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 30 వార్డులలో 100 పనులు మంజూరయ్యాయని, వాటన్నింటినీ ఒకేసారి ప్రారంభిస్తామని, మార్చి నెలాఖరులోపు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.