అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్ర విమర్శలు

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నారా చంద్రబాబునాయుడును విమర్శించే హక్కు వైసీపీ నేతలకు లేదని, తెలుగుదేశం పార్టీ లక్ష్యం అభివృద్ధేనని, పాలన అంటే ప్రజలకు సేవ చేయడమని ఆయన అన్నారు. గత వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటే తగిన రీతిలో స్పందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్