పార్వతీపురం పట్టణంలో నూతన హంగులతో సుందరీకరించిన మెప్మా జిల్లాకార్యాలయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గురువారం ప్రారంభించారు. సుందరంగా తీర్చి దిద్దిన మెప్మా కార్యాలయంలో రిబ్బను కత్తిరించి ప్రారంభించిన ఎమ్మెల్యే అధికారులు సిబ్బందితో మాట్లాడి సంస్థ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో మెప్మా ఆర్పీలు కీలకపాత్ర పోషించాలని సూచించారు.