రూ.3కోట్ల హాస్టల్ కు ఎమ్మెల్యే విజయచంద్ర శంకుస్థాపన

పార్వతీపురం పట్టణం చాకలిబెలగాంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ బాలుర వసతిగృహ సముదాయానికి ఎమ్మెల్యే విజయచంద్ర శంకుస్థాపన చేశారు. ఈ వసతిగృహం సుమారు వంద మంది విద్యార్థులకు అన్ని వసతులతో అందుబాటులో ఉంటుందని, ఇది ఎస్సీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంజూరైన తొమ్మిది వసతిగృహాలలో ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాకు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, సోషల్ వెల్ఫేర్ మంత్రిని కోరగా, ఈ వసతిగృహం మంజూరు చేయబడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్