పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, శుక్రవారం పార్వతిపురంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ వైద్యుడు, టిడిపి నాయకులు చీకటి బద్రి నారాయణను ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర డాక్టర్ బద్రినారాయణ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.