ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయం అవసరం

మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలను విస్తృతంగా అనుసరించాలని సూచించారు. పార్వతీపురంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పీఎండీఎస్ నవధాన్యాల పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. పొలాల గట్లపై మునగ, పనస, జామ, సీతాఫలం వంటి చెట్లు పెంచి అదనపు ఆదాయం పొందాలని, రసాయనాల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, తక్కువ వర్షపాత పరిస్థితుల్లో పీఎండీఎస్ పంటలు రైతులకు ఆదాయ భద్రత కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్