పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర టిడ్కో గృహాల చెల్లింపుల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని లబ్ధిదారులను హెచ్చరించారు. స్థానిక పురపాలక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గతంలో చెల్లించిన నగదు రూ. 2.25 కోట్లు ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. కొందరు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలకు లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జూన్ నాటికి మౌలిక సదుపాయాలు పూర్తి చేసి ఇళ్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.