ఏయూ ప్రత్యేక డ్రైవ్ పరీక్షలకు సంబంధించిన ప్రకటనను పరీక్ష నియంత్రణ అధికారి టి. చిట్టిబాబు మంగళవారం విడుదల చేశారు. 2010–11 అకాడెమిక్ సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ లేదా పీజీలో చేరిన విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. డిసెంబర్ 4 నుంచి 26 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. పరీక్షలను ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.