కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్వతీపురం మండలం గోపాలపురం గ్రామంలో వృద్ధులు, వికలాంగులు, వితంతవులకు పంపిణీ చేశారు. ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికే పెన్షన్ మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పంపిస్తున్నారని, ఈ నెలలో 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసి వృద్ధులకు అండగా నిలిచారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 63.57 లక్షల మందికి నెలనెలా 2745 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.