రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సీతంపేట మండలం వాబ జంక్షన్ సమీపాన ప్రధాన రహదారి మలుపు వద్ద గురువారం ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో పాలకొండ మండలం జంపరకోట గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావు (60) అక్కడికక్కడ మృతి చెందారు. ఆయన భార్య జీలకర్ర వరలక్ష్మి (55) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్