పార్వతీపురం: ఆగష్టు 2న అన్నదాత సుఖీభవ ప్రారంభం

ఆగష్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించాలని సీఎం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఇది ఒకటని, ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్