ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన తపాలాశాఖ మాజీ ఉద్యోగి అన్నాజీరావు (65) ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం పార్వతీపురంలో జరిగింది. సాయినగర్ కాలనీలో నివసించే ఆయన ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గడ్డిమందు తాగగా, కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి విజయనగరానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.