జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన వినతులపై అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి 160 వినతులను కలెక్టర్ స్వీకరించారు.