సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించడం జరుగుతుందని పార్వతీపురం ఐటిడిఎ పి ఓ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మన్యం జిల్లా నీతి ఆయోగ్ కింద అశావాహ జిల్లాలలో ఒకటిగా ఉందన్నారు. ఇందులో భాగంగా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు వంటి 12 కీలక సామాజిక రంగ సూచికలలో ఆయా రంగాలలో పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన చెప్పారు.