పార్వతీపురం: రైల్వేస్టేషన్ లో మృతదేహం లభ్యం

పార్వతీపురం రైల్వే స్టేషన్ లో గురువారం ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ప్లాట్ ఫారంపై ఓ వ్యక్తి పడివున్నాడని సమాచారం అందడంతో జీఆర్పీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అతడు మృతిచెందినట్టు గుర్తించారు. అతడిని జియ్యమ్మవలస మండలం డంగభద్రకు చెందిన డి. పోలిరాజు(37)గా గుర్తించారు. సహజ మరణంగా అనుమానిస్తున్నామని హెచ్సీ రత్నకుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్