పార్వతీపురం: రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న పెన్షన్ల పండుగ

రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న పెన్షన్ల పండుగ వైభవంగా జరుగుతోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వం పార్వతీపురంకు నూతనంగా మంజూరు చేసిన 80 వితంతు పెన్షన్లను శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్