పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన, తిరుపతి జీవకోనలో నివసిస్తున్న శ్రీనివాసులు (46 న్యూ బాలాజీ కాలనీలో నూతన భవన నిర్మాణ పనులకు కూలీగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి సంపులోని నీటిని తొలగించేందుకు విద్యుత్ మోటార్ వేశారు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.