పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. పాచిపెంట మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద అధికారులు 346 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.15.83 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.