What: ఆదివాసి దినోత్సవంపై రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సమీక్షిస్తారని జిల్లా రెవిన్యూ అధికారి కె హేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరు కావాలని ఆమె కోరారు.