పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎగిరెడ్డి నారాయణరావు అంతిమయాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పాడె మోశారు. నారాయణరావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన పార్వతీపురం మండలం నర్సిపురంలో గురువారం జరిగాయి. ఎగిరెడ్డి ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన భౌతిక దేహంపై పార్టీ జెండాను కప్పి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని ఎమ్మెల్యే అన్నారు.