పారదర్శకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిజాయితీగా సాగుతున్న ఎన్డీఏ కూటమి సుపరిపాలనపై విష ప్రచారం చేస్తున్న వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. సీతానగరం మండలం కృష్ణ రాయపురంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం బుధవారం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా గ్రామంలో పర్యటించగా, ప్రజల నుండి విశేష స్పందన లభించింది.