మన్యం వీరుడు అల్లూరికి పోలీసుల ఘన నివాళులు

పార్వతీపురం మన్యం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం స్వాతంత్ర్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ థామస్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్