‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ

పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. జూన్ 4 నుంచి 12 వరకు వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4న టీడీపీ ఎన్నికల హామీలపై నిరసనలు, జూన్ 8, 9 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, జూన్ 12న భారీ నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్