మన్యం జిల్లాలో ప్రజారోగ్య రక్షణే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ఎయిడ్స్ నియంత్రణ, టి.బి నిర్మూలన కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. హెచ్‌ఐవీ పరీక్షలను మరింత విస్తృతంగా నిర్వహించాలని, గర్భిణులందరికీ పరీక్షలు చేయాలని సూచించారు. 100 రోజుల టి.బి ముక్త భారత్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి అనుమానితులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పనితీరు సరిగా లేని సిబ్బందిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.