మన్యం జిల్లాలో 905 కేంద్రాల్లో పల్స్ పోలియో ప్రారంభం

మన్యం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బెలగాం డీవీఎంఎం పాఠశాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలో 905 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 99,507 మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేయనున్నట్లు వెల్లడించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్