పుట్టపర్తి జయంతి.. సాహిత్యానికి ఆయన సేవలు చిరస్మరణీయం

శనివారం పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయంలో పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో పుట్టపర్తి సేవలు అమూల్యమని, శివతాండవం వంటి కృతి ఆయన ప్రతిభకు నిదర్శనమని, చిన్న వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ రచన చేసి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్