సాలూరు మండలం తోణాం ఆశ్రమ పాఠశాల విద్యార్ధి పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న కొర్రా సునీల్ బుధవారం స్నానం చేసేందుకు పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న వార్డెన్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స జరిపించి, సాలూరు ఆసుపత్రికి తరలించగా వారు విజయనగరం ఘోష ఆసుపత్రికి పంపించారు.