పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని పెద కోమటి పేటలో గల శ్రీ సీతారామ ఆలయంలో 19వ తేదీ నుండి జరుగుతున్న శ్రీసీతారామ వసంత నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సుతాపల్లి శ్రీనివాస్, వెంకటలక్ష్మి దంపతులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, తీర్థప్రసాదాలు, తలంబ్రాలు స్వీకరించారు.