శుక్రవారం సీతానగరం మండలం కాశాపేటలో టి. సత్యంనాయుడు పశువుల కోసం పొలం నుంచి ట్రాక్టర్ పై గడ్డి తీసుకెళ్తుండగా, గ్రామంలో విద్యుత్తు తీగకు తాకి మంటలు చెలరేగాయి. బొబ్బిలి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాలీ, గడ్డి దగ్ధమై సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.