తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే పాఠశాలల అభివృద్ధి సాధ్యమని కొత్తవలస సర్పంచ్ రెడ్డి అనిత అప్పలనాయుడు అన్నారు. గురువారం మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస గ్రామంలో పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో సర్పంచ్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఈ పాఠశాల నుంచే అనేక మంది ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచవద్దన్నారు.